ఎందుకు
లోకంలో ఎవరైనా ఎక్కడ నివసిస్తున్నా “నా భాష ఇదీ” అని చెప్పుకోగలగాలి. మనం తెలుగు వాళ్ళం. #మనమాతృభాషతెలుగు అని చాటిచెప్పుదాం!
ఎప్పుడు
ఫిబ్రవరి 21, గురువారం. కానీ మీ మిత్రబృంద సౌకర్యార్థం ఫిబ్రవరి 23 లేదా 24 (శని, ఆది) ఏదైనా ఒక రోజు అనుకోండి. మీ దగ్గలో ఉన్న తెలుగు సంఘాలు కానీ, సాహితీ, స్వచ్ఛంద సంస్థలు గానీ మాతృభాషా దినోత్సవ సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటుచేసే ఉంటాయి. కనుక్కోండి. వాటిలో #మనమాతృభాషతెలుగు బావుటా ఎగురవేయండి.
ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాల జాబితాలో, మీరు జరిపే కార్యక్రమాన్ని కూడా చేర్చడానికి, దాన్ని ఇక్కడ చేర్చండి.
ఎలా
☞ మీ చుట్టుపక్కల ఉన్న తెలుగు వారందరూ ఒకచోట చేరి కాసేపు తెలుగులో మాట్లాడుకోండి. తెలుగు గురించి మాట్లాడుకోండి!
☞ తెలుగువారిలో మాతృభాష పట్ల ఆసక్తిని పెంచే మరే కార్యక్రమమైనా జరుపుకోండి.
☞ #మనమాతృభాషతెలుగు అని ఉన్న బ్యానరు, పతాకం, జెండాలతో ఫొటో లేదా సెల్ఫీ దిగండి. దాన్ని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పంచుకోండి. దానికి #మనమాతృభాషతెలుగు అనే ట్యాగు తగిలించడం మర్చిపోకండేం!
మీ ప్రదర్శనకు ఇలాంటి బ్యానర్లను, పోస్టర్లను వాడుకోవచ్చు:![]()
కుడి-నొక్కు నొక్కి వీటిని మీ కంప్యూటరులో భద్రపరచుకోండి:
8ftx4ft @ 96dpi
• banner 2x1 (EPS)
• banner 2x1 (PDF)
సెల్ఫీలు దిగడానికి A4 సైజులో కూడా: poster A4 (PDF)
మీ మాతృభాషాభిమానాన్ని చాటిచెప్పడానికి ఈ ఫేస్బుక్ ఫ్రేముని వాడండి.
ఎక్కడ
లోకమంతటా! తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడే! మీరు ఉన్న చోట కూడా.
ఎవరు
మనం! తెలుగువారందరమూ!! రాజుగారి సంబరానికి పాలు పొయ్యమంటే అందరూ నేనొక్కడినీ నీళ్ళుపోస్తే ఏమవుతుందిలే అనుకున్నారంట. తీరా చూస్తే, అన్నీ నీళ్ళే అంట! అలాకాకుండా…
“ఇంతమంది తెలుగువాళ్ళున్నారా?” అని ఈ ప్రపంచం ఆశ్చర్యపోవాలి!